షార్జీల్ ఇమామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వు
ABN , First Publish Date - 2020-06-26T00:04:52+05:30 IST
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి షార్జీల్ ఇమామ్ పిటిషన్‌పై

న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి షార్జీల్ ఇమామ్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వు చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తును పూర్తి చేయడానికి అదనపు సమయం తీసుకునేందుకు పోలీసులకు ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఇమామ్ హైకోర్టును ఆశ్రయించారు.
ట్రయల్ కోర్టు ఏప్రిల్ 25న ఇచ్చిన ఆదేశాల్లో లోపాలేవీ లేవని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం నమోదైన ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయడానికి చట్టపరంగా అనుమతి ఉన్న 90 రోజులకు మించి, మరొక 3 నెలలు అదనంగా తీసుకోవచ్చునని ట్రయల్ కోర్టు చెప్పిందని తెలిపారు. ఇమామ్ వాదనను వ్యతిరేకించారు.
జస్టిస్ వి కామేశ్వర రావు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపారు. ఈ నెల 28నాటికి లిఖితపూర్వక వినతులను సమర్పించాలని ఇరు పక్షాల న్యాయవాదులను కోరారు. లిఖితపూర్వక వినతులను సమర్పించిన తర్వాత ఆర్డర్ జారీ చేస్తామని చెప్పారు.
గత ఏడాది డిసెంబరులో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వద్ద సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా హింసాత్మక నిరసనలకు సంబంధించిన కేసులో ఇమామ్‌ను అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 28న బిహార్‌లోని జెహానాబాద్‌లో ఆయనను అరెస్టు చేశారు.