కరోనా వచ్చిన ఢిల్లీ ఆరోగ్యమంత్రికి ప్లాస్మా థెరపీ!

ABN , First Publish Date - 2020-06-20T02:18:23+05:30 IST

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

కరోనా వచ్చిన ఢిల్లీ ఆరోగ్యమంత్రికి ప్లాస్మా థెరపీ!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ ఆరోగ్యశాఖా మంత్రి సత్యేందర్ జైన్ కూడా కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. కాగా, ఆయనకు ట్రీట్‌మెంట్‌లో భాగంగా ప్లాస్మా థెరపీ అందించనున్నట్లు సమాచారం. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను ఢిల్లీలోని మ్యాక్స్ హాస్పిటల్‌కు శుక్రవారం తరలించారు. ఇక్కడే ఆయనకు ప్లాస్మా థెరపీ చేస్తారని తెలుస్తోంది. కరోనా అని తేలిన తర్వాత సత్యేందర్‌కు న్యూమోనియా కూడా వచ్చింది. దీంతో ఆయన్ను రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ సపోర్ట్‌లో ఇన్ని రోజులు ఉంచారు. అయినాసరే పరిస్థితి విషమించడంతో మ్యాక్స్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

Updated Date - 2020-06-20T02:18:23+05:30 IST