అది అమానుషం.. ప్రైవేటు ఆస్పత్రులపై హైకోర్టు ఆగ్రహం!

ABN , First Publish Date - 2020-12-26T11:53:55+05:30 IST

కరోనా మహమ్మారితో బాధపడే వారికోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసీయూ వార్డులను రిజర్వ్ చేసుకోవడం అమానుషం అని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అది అమానుషం.. ప్రైవేటు ఆస్పత్రులపై హైకోర్టు ఆగ్రహం!

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో బాధపడే వారికోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఐసీయూ వార్డులను రిజర్వ్ చేసుకోవడం అమానుషం అని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలోని చాలా ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లను కరోనా పేషెంట్ల కోసం రిజర్వ్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతోందని, ఇలాంటి సమయంలో ఐసీయూలను రిజర్వ్ చేయడం సరైన నిర్ణయం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ని ఐసీయూ బెడ్లను కేవలం కరోనా బాధితుల కోసం రిజర్వు చేసి కూర్చోవడం తగదు అని జస్టిస్ నవీన్ చావ్లా స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-26T11:53:55+05:30 IST