ఢిల్లీ వీధుల్లో హైటెక్ మిషన్లతో శానిటైజేషన్

ABN , First Publish Date - 2020-04-14T21:59:39+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నియంత్రణకకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా...

ఢిల్లీ వీధుల్లో హైటెక్ మిషన్లతో శానిటైజేషన్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నియంత్రణకకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మంగళవారం నుంచి జపాన్‌కు చెందిన హైటెక్ మిషన్లతో శానిటైజేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ మిషన్లు ప్రతి వీధిలో తిరుగుతూ ప్రతి ఇంట్లో శానిటేషన్ ద్రావణాన్ని స్ప్రే చేస్తాయి. శానిటైజేషన్ కోసం పీపీఎం సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీధుల్లో శానిటైజేషన్ స్ప్రే చేస్తున్న ఈ మిషన్ల ఫోటోలను సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. శానిటైజేషన్ కోసం మొత్తం 60 మిషన్లను తెప్పించామని, అందులో జపాన్‌నుంచి తెప్పించిన 10 హైటెక్ మిషన్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. ఎంఎల్ఏ రాఘవ్ చద్దా మాట్లాడుతూ ఈ మిషన్లు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయని, చిన్న చిన్న సందులలోకి కూడా ఇవి వెళ్లగలవని చెప్పారు. 

Updated Date - 2020-04-14T21:59:39+05:30 IST