ఆంక్షల సడలింపు: ఢిల్లీ ప్రభుత్వానికి నాలుగు లక్షల సూచనలు!
ABN , First Publish Date - 2020-05-14T00:33:02+05:30 IST
మే 17 తరువాత ఏం చేయాలనేదానిపై ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నుంచి సూచనలు కోరగా..దాదాపు 4లక్షల సలహాలు ప్రభుత్వానికి చేరాయి.

న్యూఢిల్లీ: మే 17 తరువాత ఏం చేయాలనేదానిపై ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నుంచి సూచనలు కోరగా..దాదాపు 4లక్షల సలహాలు ప్రభుత్వానికి చేరాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 10 వేల ఈ-మెయిల్స్, 4 లక్షల వాట్సాప్ సందేశాలు వచ్చాయని తెలిపింది. మరో 27 వేల రికార్డెడ్ సందేశాలు కూడా వచ్చాయంది. ఢిల్లీ ప్రభుత్వానికి సూచనలు చేయండి అంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం ట్విటర్ ద్వారా ప్రజలను కోరారు. తమ సూచనలు తెలియజేసేందుకు ప్రజలకు బుధవారం సాయంత్రం ఐదు గంటల దాకా అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి నాలుగు లక్షలకు పైగా సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అందాయని తెలుస్తోంది.