సినీ ప్రేక్షకులకు శుభవార్త... థియేటర్లు తెరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతి...

ABN , First Publish Date - 2020-10-08T02:19:19+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ట్విటర్ వేదికగా సినీ ప్రేక్షకులకు శుభవార్త చెప్పారు.

సినీ ప్రేక్షకులకు శుభవార్త... థియేటర్లు తెరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతి...

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ట్విటర్ వేదికగా సినీ ప్రేక్షకులకు శుభవార్త చెప్పారు. ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు, సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు. 


మరోవైపు వారాంతపు మార్కెట్లు యథావిథిగా తెరవవచ్చునని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్కొక్క జోన్‌కు రెండు మార్కెట్ల చొప్పున మాత్రమే తెరిచేందుకు అనుమతి ఉండేది. కేజ్రీవాల్ తాజా ప్రకటన ప్రకారం అన్ని మార్కెట్లను తెరవవచ్చు. అన్ని మార్కెట్లను తిరిగి తెరవడం వల్ల సమాజంలోని పేద వర్గాలకు గొప్ప ఊరట లభిస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 


ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు చెప్తూ, గరిష్ఠంగా 50 శాతం సీట్లకు మాత్రమే ప్రేక్షకులను అనుమతిస్తామని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని కోరారు. 


Read more