వంద రోజులుగా సీల్ ... అయినా అక్కడ తెగని కరోనా చైన్!
ABN , First Publish Date - 2020-07-19T13:02:41+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో గల జీబీటీ ఎన్‌క్లేవ్‌కు చెందిన ఈ పాకెట్ ప్రాంతంలో ఇప్పటివరకు 25 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న కారణంగా ఈ ప్రాంతం 100 రోజులుగా కంటైన్‌మెంట్ జోన్‌లో ఉంది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు...

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో గల జీబీటీ ఎన్‌క్లేవ్‌కు చెందిన ఈ పాకెట్ ప్రాంతంలో ఇప్పటివరకు 25 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న కారణంగా ఈ ప్రాంతం 100 రోజులుగా కంటైన్‌మెంట్ జోన్‌లో ఉంది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఈ ప్రాంతానికి వెళ్లే మార్గాలన్నింటినీ సీలు చేశారు. ఏప్రిల్ 6న ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు నివాసితుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంఎం త్రిపాఠి తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు ఐదువేల మంది నివసిస్తున్నారని, 1026 ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు. కాగా ఆర్‌డబ్ల్యుఎ ప్రధాన కార్యదర్శి ఎంఎం త్రిపాఠి మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక్కడి ప్రజల ఆరోగ్య రక్షణకు ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అలాగే ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇక్కడి ప్రజలకు రోగనిరోధక శక్తి పెంపుదలకు ఔషధాలను పంపిణీ చేసిందని తెలిపారు. కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, అయినా ఇక్కడ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. కేసులు నమోదవుతున్న చోట రెగ్యులర్ శానిటైజేషన్ జరుగుతోందని, రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారన్నారు.