ఢిల్లీలో కరోనా విజృంభణ... ఒక్కరోజులో 131 మంది మృతి. 7,486 కొత్త కేసులు!

ABN , First Publish Date - 2020-11-19T12:00:25+05:30 IST

పెరుగుతున్న కరోనా కేసులు ఢిల్లీవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో...

ఢిల్లీలో కరోనా విజృంభణ... ఒక్కరోజులో 131 మంది మృతి. 7,486 కొత్త కేసులు!

న్యూఢిల్లీ: పెరుగుతున్న కరోనా కేసులు ఢిల్లీవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 131 మంది మృతి చెందారు. ఒక్క రోజులో కరోనా కారణంగా మృతి చెందినవారిలో ఇదే అత్యధికం. ఇక గడచిన 24 గంటల్లో కొత్తగా 7,486 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఐదు లక్షలను దాటింది. 


అలాగే కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 7,943కు చేరింది. ఢిల్లీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 62,232 నమూనాలను పరీక్షించారు. ప్రస్తుతం ఢిల్లీలో 42,458 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,03,084కు చేరింది. ఢిల్లీలో కరోనా కట్టటికి ఇంటింటి సర్వేను చేపట్టారు. 

Updated Date - 2020-11-19T12:00:25+05:30 IST