ఢిల్లీలో కరోనా డేంజర్ బెల్స్
ABN , First Publish Date - 2020-06-12T04:02:54+05:30 IST
దేశ రాజధానిలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,877 కరోనా పాజిటవ్ కేసులు నమోదు కాగా..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,877 కరోనా పాజిటవ్ కేసులు నమోదు కాగా 65 మంది మృతి చెందారు. ఢిల్లీలో ఇప్పటివరకూ మొత్తం 34,687 కేసులు నమోదు కాగా 1085 మంది మృతి చెందారు. ఇంకా 20,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 12,731 మంది డిశ్చార్జ్ అయినట్లు ఢిల్లీ ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.