ఢిల్లీలో మూడవరోజూ తగ్గిన కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-12-06T14:40:22+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌కు అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. అయితే ఇప్పుడు...

ఢిల్లీలో మూడవరోజూ తగ్గిన కరోనా కేసులు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌కు అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. అయితే ఇప్పుడు ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా కేసుల నమోదులో వరుసగా మూడవరోజు కూడా 5 శాతం మేరకు తగ్గుదల కనిపించింది. దీనికితోడు రికవరీ రేటులోనూ మెరుగుదల కనిపించింది. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 3,419 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,89,544కు చేరింది. కరోనా కారణంగా ఢిల్లీలో ఇప్పటివరకూ 9,574 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 4,916 మంది కోలుకున్నారు. దీంతో ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,53,292కు చేరింది. గడచిన 24 గంటల్లో 81,473 కరోనా టెస్టులు చేశారు. ఢిల్లీలో ఇప్పటి వరకూ మొత్తం 66,67,176 కరోనా టెస్టులు చేశారు.

Read more