రాజధానిలో 24 గంటల్లో మళ్లీ వంద దాటిన కరోనా మృతులు... 3,726 కొత్త కేసులు!
ABN , First Publish Date - 2020-12-01T11:42:32+05:30 IST
దేశరాజధానిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో...

న్యూఢిల్లీ: దేశరాజధానిలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కరోనా మృతుల సంఖ్య తిరిగి వంద దాటింది. కరోనాతో మొత్తం 108 మంది మృతి చెందారు. ఇదే సమయంలో కొత్తగా 3,726 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజధానిలో నవంబరు 7 తరువాత గడచిన ఆదివారం నాడు 68 కరోనా మరణాలు సంభవించగా, సోమవారం తిరిగి కరోనా మరణాల సంఖ్య పెరిగింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఢిల్లీలో మొత్తంగా కరోనా బారిన పడినవారి సంఖ్య 5,70,374గా ఉండగా, ఇప్పటివరకూ కరోనాతో 9,174 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 26,645 ఆర్టీపీసీఆర్, 24,025 యాంటీజెన్ టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,885గా ఉంది. కాగా గడచిన కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఆసుపత్రులలో కరోనా బాధితులు సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో 30 శాతం ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉన్నాయి.