చైనాపై రెండు యుద్ధాల్లో గెలుస్తాం: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-06-22T18:53:34+05:30 IST

న్యూఢిల్లీ: చైనాతో రెండు రకాల యుద్ధం చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. చైనా పుట్టించిన కరోనాపై దేశమంతా ఏకమై పోరాడుతోందని, అదే సమయంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత బలగాలపై చైనా కుట్రపూరిత దాడులకు వ్యతిరేకంగా...

చైనాపై రెండు యుద్ధాల్లో గెలుస్తాం: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: చైనాతో రెండు రకాల యుద్ధం చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. చైనా పుట్టించిన కరోనాపై దేశమంతా ఏకమై పోరాడుతోందని, అదే సమయంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత బలగాలపై చైనా కుట్రపూరిత దాడులకు వ్యతిరేకంగా దేశమంతా ఏకమై భారత సైన్యానికి అండగా నిలుస్తోందని చెప్పారు. కరోనాతో పాటు చైనా సైన్యంపైనా పోరాడి గెలుస్తామన్నారు. 


గతంలో రోజుకు ఐదువేల టెస్టులు చేసేవారమని, నేడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రోజుకు 18 వేల టెస్టులు చేస్తున్నామని ఢిల్లీ సీఎం తెలిపారు. టెస్టులకు సంబంధించి ప్రజలకు ఇక ఇబ్బందులుండబోవన్నారు. ఢిల్లీలో కరోనా సోకుతున్నవారు, కోలుకుంటున్నవారు సమ సంఖ్యలో ఉంటున్నారని కేజ్రీవాల్ చెప్పారు. 

Updated Date - 2020-06-22T18:53:34+05:30 IST