దేశంలో ఢిల్లీలోనే కరోనా మృతుల సంఖ్య అత్యల్పం!
ABN , First Publish Date - 2020-10-03T14:52:34+05:30 IST
దేశంలోని అన్ని మహానగరాల్లోకన్నా రాజధాని ఢిల్లీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే మృతుల సంఖ్య విషయానికొస్తే ఢిల్లీలో చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీనిని చూస్తే ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న కరోనా కట్టడి...

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని మహానగరాల్లోకన్నా రాజధాని ఢిల్లీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే మృతుల సంఖ్య విషయానికొస్తే ఢిల్లీలో చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీనిని చూస్తే ఢిల్లీ ప్రభుత్వం చేపడుతున్న కరోనా కట్టడి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,82,752 మందికి కరోనా సోకగా, 5,401 మంది మృత్యువాత పడ్డారు.
దీని ప్రకారం ఢిల్లీలో డెత్ రేటు 1.9శాతంగా ఉందని తెలుస్తోంది. ఇతర మహానగరాల విషయానికొస్తే ముంబైలో డెత్ రేటు 4.3 శాతం, చెన్నైలో 1.93 శాతం, లక్నోలో 2.5 శాతం, ఇండోర్‌లో 2.3 శాతంగా ఉంది. ముంబైలో కరోనా డెత్ రేటు అత్యధికంగా ఉంది. తరువాతి స్థానంలో ఢిల్లీ ఉంది. మూడవ స్థానంలో చెన్నై ఉంది. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు గత 10 రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు.