హోటళ్లలో చైనా పౌరులను అనుమతించం : యజమానులు
ABN , First Publish Date - 2020-06-25T23:31:18+05:30 IST
భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ యజమానులు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు.

న్యూఢిల్లీ : భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ యజమానులు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా పౌరులెవ్వరికీ కూడా గెస్ట్ హౌజ్‌లలో కానీ, హోటళ్లలో కాని బస చేయడానికి అనుమతి ఇవ్వకూడదని కీలక నిర్ణయం తీసుకుంది.
‘‘ఢిల్లీలోని హోటళ్లలో కానీ, గెస్ట్ హౌజ్‌లలో కానీ చైనా పౌరులకు వసతి సదుపాయం కల్పించకూడదని నిర్ణయించుకున్నాం. ఢిల్లీలో 3,000 బడ్జెట్ హోటళ్లు, గెస్ట్ హౌజ్‌లూ ఉన్నాయి. వీటిలో చైనాకు చెందిన ఏ వస్తువునూ వాడకూడదని నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయాన్ని విస్తృతంగా ప్రచారం చేయబోతున్నాం’’ అని ఢిల్లీ హోటల్స్ మరియు రెస్టారెంట్ ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధులు తేల్చి చెప్పారు. భారత్‌లో చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.