కోవిడ్ వ్యాక్సిన్ రవాణాకు హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు సిద్ధం: అధికారులు

ABN , First Publish Date - 2020-12-06T03:35:15+05:30 IST

కోవిడ్ వ్యాక్సిన్ రవాణాకు హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు సిద్ధం: అధికారులు

కోవిడ్ వ్యాక్సిన్ రవాణాకు హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు సిద్ధం: అధికారులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ రవాణాకు హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల ఎయిర్ కార్గో సేవలు.. పంపిణీ వ్యవస్థల ద్వారా కోవిడ్ -19 వ్యాక్సిన్ల రవాణాకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. "టెర్మినల్స్ ప్రత్యేక గేట్లను కలిగి ఉన్నాయని, వ్యాక్సిన్లను తీసుకువెళ్ళే వాహనాలను వేగంగా తరలించడానికి, హైదరాబాద్ విమానాశ్రయంలో ఆధునిక ఉష్ణోగ్రత-సెన్సిటివ్ ఫార్మా మరియు టీకా నిల్వ మరియు ప్రాసెసింగ్ జోన్లు ఉన్నాయని ఒక అధికారి తెలిపారు.

Updated Date - 2020-12-06T03:35:15+05:30 IST