భారత రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-06-04T11:38:05+05:30 IST

భారత కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు కరోనా వైరస్ సోకింది...

భారత రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా వైరస్

న్యూఢిల్లీ : భారత కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు కరోనా వైరస్ సోకింది. అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో అతన్ని హోం క్వారంటైన్ చేశారు. అనంతరం ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ కేంద్ర కార్యాలయమైన రైజినా హిల్స్ లోని సౌత్ బ్లాకులో పనిచేస్తున్న 35 మంది ఉద్యోగులను ముందుజాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్ చేశారు. రక్షణ శాఖ కార్యదర్శికే కరోనా సోకడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముందుజాగ్రత్తగా బుధవారం కార్యాలయానికి హాజరుకాలేదు. సౌత్ బ్లాకులో కేంద్ర రక్షణశాఖ మంత్రి, రక్షణ శాఖ కార్యదర్శి, ఆర్మీచీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు మొదటి అంతస్తులో ఉన్నాయి. రక్షణ శాఖ కార్యదర్శి కార్యాలయాన్ని శానిటైజ్ చేయించి, ఉద్యోగులను హోం క్వారంటైన్ చేశారు. 

Updated Date - 2020-06-04T11:38:05+05:30 IST