కరోనాపై మిశ్రమ ప్రకటనలు సరికాదు

ABN , First Publish Date - 2020-07-15T07:38:30+05:30 IST

కరోనాపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు మిశ్రమ ప్రకటనలు చేస్తుండడంతో ప్రజల్లో ఈ వైరస్‌ నియంత్రణకు సంబంధించి విశ్వాసం సన్నగిల్లినట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రేయేసస్‌ పేర్కొన్నారు...

కరోనాపై మిశ్రమ ప్రకటనలు సరికాదు

  • డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌

జెనీవా, జూలై 14: కరోనాపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు మిశ్రమ ప్రకటనలు చేస్తుండడంతో ప్రజల్లో ఈ వైరస్‌ నియంత్రణకు సంబంధించి విశ్వాసం సన్నగిల్లినట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రేయేసస్‌ పేర్కొన్నారు. సోమవారం జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ.. నాయకుల ప్రకటనలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉండాలన్నారు. టెడ్రోస్‌ నేరుగా ఎవరి పేరును ప్రస్తావించకున్నా.. వైర్‌సను నిర్మూలించేందుకు కొన్ని దేశాలు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.  


Updated Date - 2020-07-15T07:38:30+05:30 IST