మాల్స్‌ ప్రారంభంపై త్వరలో నిర్ణయం

ABN , First Publish Date - 2020-05-30T08:56:51+05:30 IST

ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణ నలోకి తీసుకున్న తర్వాత మాల్స్‌లో

మాల్స్‌ ప్రారంభంపై త్వరలో నిర్ణయం

  •  కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడి 

న్యూఢిల్లీ, మే 29: ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణ నలోకి తీసుకున్న తర్వాత మాల్స్‌లో దుకాణాలను ప్రారంభించే నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం వెల్లడించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, వర్తక సంఘాల ప్రతినిధుల మధ్య స మావేశం జరిగిందని, ఈ సందర్భంగా రిటైల్‌ వర్తకుల సమస్యలపై చర్చించినట్టు తెలిపింది. లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో సడలింపులు ఇచ్చినా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని రిటైల్‌ ట్రేడర్లు పేర్కొన్నారు. అయితే నిత్యావసరం, నిత్యావసరం కాదు అన్న తేడా లేకుండా మెజారిటీ దుకాణాలు ప్రా రంభించేందుకు అనుమతించిన విషయాన్ని సమావేశంలో మంత్రి గుర్తు చేశారు.


ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) రూ.3 లక్షల క్రెడిట్‌ గ్యారెంటీని ప్రభుత్వం ఇచ్చిందని, ఇందులో వర్తకులు కూడా ఉన్నారని గోయల్‌ పేర్కొన్నారు. ఈ-కామర్స్‌ సంస్థల గురించి వర్తకులు భయపడాల్సిన అవసరం లేదని, సంక్షోభ సమయాల్లో తమకు సమీపంలోని దుకాణాలే ఆదుకున్నాయన్న విషయాన్ని వినియోగదారులు గుర్తించారని మంత్రి తెలిపారు.  వర్తకులు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు సాంకేతిక మద్దతు కూడా అందించాలనుకుంటున్నామని చెప్పారు. 

Updated Date - 2020-05-30T08:56:51+05:30 IST