వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహాకుంభమేళా నిర్వహిస్తాం...

ABN , First Publish Date - 2020-06-22T12:37:40+05:30 IST

సనాతన ధర్మం, సంప్రదాయాల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో మహా కుంభమేళా-2021 ను నిర్వహిస్తామని ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు.....

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహాకుంభమేళా నిర్వహిస్తాం...

ఉత్తరాఖండ్ సీఎం ప్రకటన

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): సనాతన ధర్మం, సంప్రదాయాల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో మహా కుంభమేళా-2021 ను నిర్వహిస్తామని ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. అఖారా పరిషత్ సభ్యులతో మహా కుంభమేళా-2021 నిర్వహించే విషయమై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో  తాము అఖాడ పరిషత్ సభ్యులతో సంప్రదింపులు జరిపిన తర్వాత మహా కుంభమేళాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించామని సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ట్వీట్ చేశారు. మహాకుంభమేళాను సనాతన ధర్మం, సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తామని సీఎం పేర్కొన్నారు. మహాకుంభమేళాను ఫిబ్రవరిలో నిర్వహించాలని అఖారా పరిషత్ నిర్ణయించిందని అఖారా పరిషత్ మహంత్ హరిగిరి జీ మహారాజ్ చెప్పారు. అంతకు ముందు ఉత్తరాఖండ్ సీఎం రావత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కన్వర్ యాత్రను నిర్వహించవద్దని నిర్ణయించారు. 

Updated Date - 2020-06-22T12:37:40+05:30 IST