స్పెయిన్‌లో 21వేలు దాటిన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-04-22T04:14:04+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి.. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది.

స్పెయిన్‌లో 21వేలు దాటిన కరోనా మరణాలు

మాడ్రిడ్: ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి.. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. స్పెయిన్‌లో మంగళవారం నాడు ఒక్కరోజే 430 కరోనా మరణాలు రికార్డయ్యాయి. దీంతో మొత్తం స్పెయిన్‌లో ఈ మహమ్మారికి బలైన వారి సంఖ్య 21,282కు చేరింది. ఈ సంఖ్య సోమవారం 399గా ఉంది. అలాగే మంగళవారం నాడు కొత్తగా 3,968 కరోనా కేసులు నమోదవడంతో.. స్పెయిన్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2.04లక్షలు దాటింది. ప్రస్తుతం అమెరికా తర్వాత ఎక్కువ కరోనా కేసులుంది ఇక్కడే. కాగా, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న లక్షణాలు కనబడుతున్నాయని అధికారులు చెప్తున్నారు.

Updated Date - 2020-04-22T04:14:04+05:30 IST