పరువు హత్యకేసులో ఆరుగురి ఉరిశిక్ష రద్దు

ABN , First Publish Date - 2020-06-23T06:50:33+05:30 IST

నాలుగేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన ఉడుమలైపేట పరువు హత్యకేసులో ఆరుగురు నిందితులకు దిగువ కోర్టు విధించిన ఉరిశిక్షను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది...

పరువు హత్యకేసులో ఆరుగురి ఉరిశిక్ష రద్దు

చెన్నై, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన ఉడుమలైపేట పరువు హత్యకేసులో ఆరుగురు నిందితులకు దిగువ కోర్టు విధించిన ఉరిశిక్షను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. తిరుప్పూరు జిల్లా ఉడుమలైపేట సమీపం కుమారలింగం ప్రాంతానికి చెం దిన శంకర్‌ అనే యువకుడు దిండుగల్‌ జిల్లా పళనికి చెందిన కౌసల్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తక్కువ జాతి కులస్థుడిని పెళ్లి చేసుకున్నందుకు శంకర్‌, కౌసల్యపై ముగ్గురు వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేశారు.


శంకర్‌ హతుడయ్యాడు. తీవ్రంగా గాయపడిన కౌసల్య ఆస్పత్రిలో కోలుకుంది. కౌసల్య తల్లిదండ్రులు, మేనమామ సహా 11 మందిపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. తిరుప్పూరు కోర్టు కౌస్యల తండ్రి చిన్నసామి, జగదీశన్‌ సహా ఆరుగురికి ఉరిశిక్ష విధించింది. స్టీఫన్‌రాజ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, మణికంఠన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కౌసల్య తండ్రి చిన్నసామి తదితరులు హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. కౌసల్యతండ్రి చిన్నసామి ఉరిశిక్షను హైకోర్టు రద్దు చేసి నిర్దోషిగా విడుదల చేసింది. ఐదుగురికి ఉరిశిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.


Updated Date - 2020-06-23T06:50:33+05:30 IST