నిజం బయట పెట్టిన నిర్జీవ శిశువు

ABN , First Publish Date - 2020-10-13T08:26:29+05:30 IST

రోడ్డు పక్కన దొరికిన నిర్జీవ గర్భస్త శిశువు.. ఒక ఘోరాన్ని బయటపెట్టింది. వాసింద్‌ పట్టణంలో రోడ్డు పక్కన ఒక మృతశిశువును పోలీసులు గుర్తించారు...

నిజం బయట పెట్టిన నిర్జీవ శిశువు

  • బాలికపై తండ్రి.. స్నేహితుడు అత్యాచారం


థానే(ముంబై), అక్టోబరు 12: రోడ్డు పక్కన దొరికిన నిర్జీవ గర్భస్త శిశువు.. ఒక ఘోరాన్ని బయటపెట్టింది. వాసింద్‌ పట్టణంలో రోడ్డు పక్కన ఒక మృతశిశువును పోలీసులు గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 17ఏళ్ల బా లికే బాధితురాలిగా గుర్తించారు. ఆమెను పోలీసులు ప్రశ్నించగా ఇంటి పక్కన ఉం డే ఒక యువకుడితో పరిచయం ఏర్పడిందని చెప్పింది. అతడు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని వెల్లడించింది. తన తండ్రి కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది. వారి వల్లే గర్భం దాల్చానని తెలిపింది. ఆమె ఫిర్యాదుతో.. తండ్రి, స్నేహితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.  

Updated Date - 2020-10-13T08:26:29+05:30 IST