‘ఫావిపిరవిర్‌’పై గ్లెన్‌మార్క్‌కు నోటీసు

ABN , First Publish Date - 2020-07-20T07:05:05+05:30 IST

యాంటీ వైరల్‌ ఔషధం ఫావిపిరవిర్‌ అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు కలిగిన కరోనా రోగులపైనా పనిచేస్తుందంటూ ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్‌ చేసుకున్న తప్పుడు ప్రచారంపై డీసీజీఐ వివరణ కోరింది...

‘ఫావిపిరవిర్‌’పై గ్లెన్‌మార్క్‌కు నోటీసు

న్యూఢిల్లీ, జూలై 19 : యాంటీ వైరల్‌ ఔషధం ఫావిపిరవిర్‌ అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు కలిగిన కరోనా రోగులపైనా పనిచేస్తుందంటూ ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్‌ చేసుకున్న తప్పుడు ప్రచారంపై డీసీజీఐ వివరణ కోరింది. ఆ మందు ధరను భారీగా పెంచి ఒక్కో మాత్రకు రూ.103 చొప్పున కంపెనీ విక్రయిస్తోందని ఆరోపిస్తూ ఓ ఎంపీ చేసిన ఫిర్యాదుపైనా స్పందించాలని గ్లెన్‌మార్క్‌ను ఆదేశించింది. తేలికపాటి నుంచి మోస్తరు ఇన్ఫెక్షన్లు కలిగిన కొవిడ్‌ రోగులకు మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో ఫావీపిరవిర్‌ అందించాలని తాము అనుమతులిస్తే.. ఇతరత్రా వ్యాధులున్న వారికీ అది పనికొస్తుందనే తప్పుడు ప్రచారం ఎలా చేసుకుంటారని ఆ నోటీసుల్లో గ్లెన్‌మార్క్‌ను ప్రశ్నించారు.


Updated Date - 2020-07-20T07:05:05+05:30 IST