అమ్మా.. నిన్ను చాలా మిస్ అవుతున్నా: సుష్మా స్వరాజ్ కుమార్తె

ABN , First Publish Date - 2020-05-10T23:10:48+05:30 IST

మాతృదినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజలు మనసుకు హత్తుకునే అనేక పోస్టులను...

అమ్మా.. నిన్ను చాలా మిస్ అవుతున్నా: సుష్మా స్వరాజ్ కుమార్తె

న్యూఢిల్లీ: మాతృదినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజలు మనసుకు హత్తుకునే పోస్టులను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ తనయురాలు బన్సూరీ స్వరాజ్ కూడా ట్విటర్ వేదికగా తన తల్లిని గుర్తు చేసుకున్నారు.  తల్లితో కలిసి చిన్నప్పుడు దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. ‘అమ్మా నీకు మాతృదినోత్సవం శుభాకాంక్షలు. నా ప్రతి ఊపిరిలోనూ నువ్వు లేని లోటు తెలుస్తోంది’ అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు.


కొన్ని గంటల క్రితం పోస్ట్ అయిన ఈ ట్వీట్ ఇప్పటికే వేల మంది హృదయాలను కదిలించింది. దాదాపు 76వేలకు పైగా లైకులు సంపాదించిన ఈ ట్వీట్‌కు 5,500 మందికి పైగా రీ ట్వీట్‌లు చేశారు. సుష్మా స్వరాజ్ వ్యక్తిత్వాన్ని పొగుడుతూ, ఇంతకంటే ఆమెకు గొప్ప నివాళి ఇంకేంముంటుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-05-10T23:10:48+05:30 IST