శాస్త్రీయ నృత్య చరిత్రకారులు సునీల్ కొఠారీ కన్నుమూత

ABN , First Publish Date - 2020-12-27T23:20:50+05:30 IST

ప్రముఖ శాస్త్రీయ నృత్య చరిత్రకారులు, విమర్శకులు పద్మశ్రీ సునీల్ కొఠారీ కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. ఆదివారం గుండెపోటుకు గురైన ఆయన..

శాస్త్రీయ నృత్య చరిత్రకారులు సునీల్ కొఠారీ కన్నుమూత

ఢిల్లీ: ప్రముఖ శాస్త్రీయ నృత్య చరిత్రకారులు, విమర్శకులు పద్మశ్రీ సునీల్ కొఠారీ కన్నుమూశారు. ఆయన వయస్సు 87 ఏళ్లు. ఆదివారం గుండెపోటుకు గురైన ఆయన.. ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించగా అక్కడే తుదిశ్వాస విడిచారు. గత నెల ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఆయన స్నేహితురాలు విధా లాల్ ప్రకటన విడుదల చేశారు. ముంబైలో 1933 డిసెంబర్ 20న జన్మించిన ఆయన చార్టడ్ అకౌంటెంట్‌‌గా ఉత్తీర్ణత సాధించారు. అయితే ఆ తర్వాత భారతీయ నృత్య కళలవైపు మళ్లారు. సుమారు 20కి పైగా పుస్తకాలు రాశారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్ నృత్యాలపై ఆయన పుస్తకాలు రచించారు. ఉదయ్ శంకర్, రుక్మిణీ దేవి అరుండల్ ఫొటో బయోగ్రఫీలు రచించారు.  

Updated Date - 2020-12-27T23:20:50+05:30 IST