రోజుకి లక్ష మందికి కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-04-07T08:09:57+05:30 IST
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోజుకి లక్ష మందికి పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి...

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోజుకి లక్ష మందికి పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనాను ఎదుర్కొనేందుకు పలు ఆవిష్కరణలకు కృషి చేస్తున్నట్లు చెప్పింది. పీసీఆర్ మిషన్ల ద్వారా పరీక్షలు జరిపేందుకు ఇప్పటికి 200 పబ్లిక్, ప్రైవేటు ల్యాబులకు అనుమతులిచ్చింది.