కరోనాను మొండిఘటంలా మార్చిన ‘డీ614జీ’ !!
ABN , First Publish Date - 2020-11-03T06:35:10+05:30 IST
మందులకు లొంగని మొండిఘటంలా కరోనా వైరస్ తయారవడానికి అందులో చోటుచేసుకున్న ఒక జన్యుమార్పే కారణమై ఉండొచ్చని అమెరికాలోని టెక్సస్ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు...
హ్యూస్టన్ (అమెరికా), నవంబరు 2: మందులకు లొంగని మొండిఘటంలా కరోనా వైరస్ తయారవడానికి అందులో చోటుచేసుకున్న ఒక జన్యుమార్పే కారణమై ఉండొచ్చని అమెరికాలోని టెక్సస్ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. 5వేల మందికిపైగా కొవిడ్-19 రోగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వారు వెల్లడించారు. మానవ శరీర కణాల్లోకి చొరబడేందుకు.. కరోనా వైర్‌సలోని స్పైక్ ప్రొటీన్ ఆయువుపట్టులా పనిచేస్తుంది. కీలకమైన స్పైక్ ప్రొటీన్‌లో జరిగిన ‘డీ614జీ’ అనే జన్యుమార్పు వల్లే కొవిడ్-19 ఇన్ఫెక్షన్ ముప్పు భారీగా పెరిగిందని గుర్తించారు. హ్యూస్టన్ నగరంలో నమోదైన తొలిదశ కరోనా కేసుల శాంపిళ్లల్లో 71 శాతం ‘డీ614జీ’ రకం జన్యుమార్పుతో ఉన్నట్లు గుర్తించామన్నారు. రెండోదశ కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత.. ఆ జన్యుమార్పులతో కూడిన కేసులు ఏకంగా 99.9 శాతానికి పెరిగాయని తెలిపారు.