తీరం దాటిన నివర్ తుపాను

ABN , First Publish Date - 2020-11-26T12:05:31+05:30 IST

తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ‘నివర్‌’ తుపాను తీరం దాటి..

తీరం దాటిన నివర్ తుపాను

చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ‘నివర్‌’ తుపాను తీరం దాటి, పుదుచ్చేరికి సమీపంలో అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా పరిణమించింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలియజేసింది.


తుపాను తీరం దాటక గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వివరించారు. మరోవైపు ఈ తుపాను తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. తుఫాను ప్రభావంతో తమిళనాడులోని తిరువణ్ణామలై, కడలూర్, కల్లకురిచ్చి, విలుప్పుంలలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుఫాను తీరం దాటే సమయంలో వీచిన గాలులకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. 

Updated Date - 2020-11-26T12:05:31+05:30 IST