‘నివర్’ అంటే వెలుగు
ABN , First Publish Date - 2020-11-26T08:42:20+05:30 IST
నివర్ తుఫానుకు ఆ పేరును ఇరాన్ దేశం పెట్టింది. పర్షియన్ భాషలో నివర్ అంటే వెలుగు. ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) ప్యానెల్ రూపొందించిన జాబితా ప్రకారం ఈ తుఫానుకు పేరు పెట్టే అవకాశం ఇరాన్‌కు దక్కింది

న్యూఢిల్లీ, నవంబరు 25: నివర్ తుఫానుకు ఆ పేరును ఇరాన్ దేశం పెట్టింది. పర్షియన్ భాషలో నివర్ అంటే వెలుగు. ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) ప్యానెల్ రూపొందించిన జాబితా ప్రకారం ఈ తుఫానుకు పేరు పెట్టే అవకాశం ఇరాన్‌కు దక్కింది. డబ్ల్యూఎంవో మార్గదర్శకాల ప్రకారం తమ ప్రాంతాల్లోని తుఫాన్లకు ఆ ప్రాంతంలోని దేశాలే పేర్లు పెట్టాలి. తద్వారా ఆ తుఫానును గుర్తించడం, దానిపై అవగాహన కల్పించడం మీడియాకు, ప్రభుత్వానికి సులభమవుతుంది.