డిసెంబర్ 1 నుంచి రాత్రి కర్ఫ్యూ: సీఎం

ABN , First Publish Date - 2020-11-25T21:18:58+05:30 IST

పూర్తి లాక్‌డౌన్ వల్ల గతంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నాయి. కొద్దిపాటి సూచనలు, నిబంధనలతో కొత్త ఆదేశాలు విడుదల చేస్తున్నాయి

డిసెంబర్ 1 నుంచి రాత్రి కర్ఫ్యూ: సీఎం

న్యూఢిల్లీ: కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తుండడంతో మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు కొన్ని నిబంధనలను కఠినతరం చేశాయి. జన సంచారాన్ని తగ్గించడంతో పాటు ప్రజలు గుంపులు కట్టకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే రాత్రి సమయాల్లో కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు.


పూర్తి లాక్‌డౌన్ వల్ల గతంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నాయి. కొద్దిపాటి సూచనలు, నిబంధనలతో కొత్త ఆదేశాలు విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం అమలు చేయబోతున్న ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అమలులో ఉండనున్నట్లు సీఎం అమరీందర్‌ సింగ్‌ బుధవారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగిస్తే రూ.1,000 జరిమానా విధించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read more