కరోనా వల్ల సీఆర్పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ మృతి

ABN , First Publish Date - 2020-04-29T03:36:43+05:30 IST

కరోనా వల్ల సీఆర్పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ మృతి

కరోనా వల్ల సీఆర్పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ మృతి

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వల్ల సీఆర్పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ మృతి చెందారు. 55 సంవత్సరాల సీఆర్పీఎఫ్ సబ్ ఇన్ స్పెక్టర్ కు కరోనా సోకడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 46 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి పరీక్షలు చేయగా .. వారికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాడ్ డౌన్ ను పొడిగించింది.

Updated Date - 2020-04-29T03:36:43+05:30 IST