సీఆర్‌పీఎఫ్‌ సేవలు భేష్‌: కిషన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-04-25T07:23:25+05:30 IST

దేశంలో శాంతిభద్రతలను కాపాడుతూ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను సమర్థంగా ఎదుర్కొనడంలో కేంద్రీయ రిజర్వ్‌ పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌) కీలక

సీఆర్‌పీఎఫ్‌ సేవలు భేష్‌: కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): దేశంలో శాంతిభద్రతలను కాపాడుతూ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను సమర్థంగా ఎదుర్కొనడంలో  కేంద్రీయ రిజర్వ్‌ పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్‌) కీలక పాత్ర పోషిస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సీఆర్‌పీఎ్‌ఫలో ప్రత్యక్షంగా నియామకమైన గెజిటెడ్‌ అధికారుల 51వ బ్యాచ్‌ ఇ-పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ను వెబ్‌ లింక్‌ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి మాట్లాడారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అన్జుమాన్‌సింగ్‌, దీప్లై, జితేందర్‌కుమార్‌ బన్సాల్‌కు అవార్డులను ప్రదానం చేశారు. సీఆర్‌పీఎఫ్‌ డీజీ ఏపీ మహేశ్వరి, అకాడమీ డైరెక్టర్‌ పంకజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-25T07:23:25+05:30 IST