కరోనాపై విజయం సాధించా: సీఆర్పీఎఫ్‌ జవాను

ABN , First Publish Date - 2020-05-13T08:24:40+05:30 IST

రెండు వారాల నుంచి కరోనాతో పోరాడుతున్న సీఆర్పీఎఫ్‌ జవాను 35ఏళ్ల సత్యబీర్‌ సింగ్‌.. ఆ మహమ్మారిపై విజయం సాధించారు. దీంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ’’కరోనా సోకిందని తెలిసిన తర్వాత నేను దానిని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతానికి నన్ను బదిలీ చేసిన కొత్త పోస్టింగ్‌ ఆర్డర్...

కరోనాపై విజయం సాధించా: సీఆర్పీఎఫ్‌ జవాను

న్యూఢిల్లీ, మే 12: రెండు వారాల నుంచి కరోనాతో పోరాడుతున్న సీఆర్పీఎఫ్‌ జవాను 35ఏళ్ల సత్యబీర్‌ సింగ్‌.. ఆ మహమ్మారిపై విజయం సాధించారు. దీంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ’’కరోనా సోకిందని తెలిసిన తర్వాత నేను దానిని ఉగ్రవాద ప్రభావిత ప్రాంతానికి నన్ను బదిలీ చేసిన కొత్త పోస్టింగ్‌ ఆర్డర్‌ అనుకున్నాను. భయపడితే దాని చేతుల్లోకి వెళ్లిపోతాం. అందుకే యుద్ధభూమి అనుకుని విజయం సాధించాను’’ అని సత్యబీర్‌ అన్నారు. కరోనా సోకేప్పటికే ఆయనకు టైఫాయిడ్‌ ఉండడం గమనార్హం. సత్యబీర్‌ సింగ్‌ 31వ బెటాలియన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 134 మందికి వైరస్‌ సోకడంతో ఈ బెటాలియన్‌ వార్తల్లో నిలిచింది. వీరిలో 54ఏళ్ల సబ్‌-ఇన్స్‌పెక్టర్‌ ఒకరు చనిపోయారు. ఇదే పారామిలటరీ దళాల్లో కరోనా వల్ల మొదటి మరణంగా నమోదైంది.

Updated Date - 2020-05-13T08:24:40+05:30 IST