ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీవ్ర వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యం

ABN , First Publish Date - 2020-04-21T12:28:52+05:30 IST

కరోనా మహమ్మారితో పాటు, గుండెపోటు, క్యాన్సర్ తదితర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఢిల్లీలోని రిజిస్టర్డ్ ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితుల్లో నగదు రహిత చికిత్స అందించనున్నారు.

ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీవ్ర వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో పాటు, గుండెపోటు, క్యాన్సర్ తదితర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఢిల్లీలోని రిజిస్టర్డ్ ప్రైవేట్ ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితుల్లో నగదు రహిత చికిత్స అందించనున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది. కరోనా మాత్రమే కాకుండా ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జస్టిస్ జే ఆర్ మిధా, జ్యోతి సింగ్ ధర్మాసనం ముందు ప్రభుత్వం ఈ విషయాన్ని తెలిపింది. కరోనా యుద్ధంలో ప్రతిరోజూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ ఇతర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందిస్తున్నారని వెల్లడించింది. ఢిల్లీ ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో అన్ని రిజిస్టర్డ్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్సను అందజేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రి లేదా నర్సింగ్ హోమ్ లో ఎవరైనా రోగికి అత్యవసర పరిస్థితుల్లో ఉచితంగా చికిత్స చేయడానికి నిరాకరిస్తే ఆ ఆసుపత్రి గుర్తింపు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. 

Updated Date - 2020-04-21T12:28:52+05:30 IST