కరోనా కాలంలో.. పేదలకు క్రిమినల్ గ్యాంగుల సాయం!
ABN , First Publish Date - 2020-05-19T02:59:31+05:30 IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. లక్షలాదిమంది ఈ వైరస్‌కు బలయ్యారు. ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది.

కేప్‌టౌన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. లక్షలాదిమంది ఈ వైరస్‌కు బలయ్యారు. ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదల బాధలు వర్ణనాతీతం. ఇలాంటి వారిని ఆదుకోవడానికి కొందరు దాతులు ముందుకొచ్చినా చాలా మంది ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో పేదలకు అండగా మేమున్నామంటూ కొన్ని క్రిమినల్ గ్యాంగులు ముందుకొచ్చాయి. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు చెందిన కొన్ని క్రిమినల్ ముఠాలు పేదలకు ఆహారం పొట్లాలు సరఫరా చేస్తున్నాయి.
‘ఈ విపత్కర పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న గ్యాంగులన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రజలకు సాయం చేయడానికే మేమంతా కలిశాం’ అని ఈ ముఠా సభ్యలు చెప్తున్నారు.