శీతాకాలంలో చలి నుంచి రక్షణకు ఆవులకు జనపనార కోట్సు

ABN , First Publish Date - 2020-11-26T14:21:21+05:30 IST

శీతాకాలంలో చలి నుంచి రక్షణకు ఆవులకు జనపనార కోట్సు అందించాలని....

శీతాకాలంలో చలి నుంచి రక్షణకు ఆవులకు జనపనార కోట్సు

ప్రయాగరాజ్ (ఉత్తరప్రదేశ్): శీతాకాలంలో చలి నుంచి రక్షణకు ఆవులకు జనపనార కోట్సు అందించాలని ప్రయాగరాజ్ జిల్లా పశుసంవర్థకశాఖ నిర్ణయించింది. చలిగాలుల నుంచి ప్రభుత్వ షెల్టర్లలో ఉన్న ఆవులకు రక్షణ కోసం జనపనార కోట్సు ఇవ్వడంతో పాటు పాలిథీన్ కర్జెన్లు అందించాలని ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఆవులకు వెచ్చదనం అందించేలా జనపనార పాత బ్యాగులతో కోట్సు తయారు చేసి అందించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో నడుస్తున్న షెల్టర్లలోని ఆవులకు పశుగ్రాసం, నీరు అందించాలని నిర్ణయించారు. 


ప్రయాగరాజ్ జిల్లాలో 113 ఆవుల షెల్టర్లు ఉన్నాయి. షెల్టర్లలోని ఆవులకు రోజు వారీగా వైద్యపరీక్షలు చేయడంతో పాటు చలి నుంచి రక్షణ కోసం జనపనార కోట్సు అందించనున్నారు. చలిగాలుల వల్ల ఆవుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశమున్నందున దీనికి చలి నుంచి రక్షణ కల్పించాలని నిర్ణయించారు. ఆవులకు జూట్ బ్యాగులతో కోట్సు తయారు చేసి చౌకధరల దుకాణాల ద్వారా అందించాలని నిర్ణయించారు.

Updated Date - 2020-11-26T14:21:21+05:30 IST