అమెరికాలో కరోనా వ్యాక్సిన్ తప్పనిసరేమీ కాదు: ఫౌచీ

ABN , First Publish Date - 2020-08-21T04:20:24+05:30 IST

కరోనా టీకా తీసుకోవడం తప్పనిసరంటూ అమెరికా ప్రభుత్వం నిబంధనలు విధించబోదని అంటువ్యాధుల నిపుణుడు ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త ఆంథోనీ ఫౌచీ స్పష్టం చేశారు.

అమెరికాలో కరోనా వ్యాక్సిన్ తప్పనిసరేమీ కాదు: ఫౌచీ

వాషింగ్టన్: కరోనా టీకా తీసుకోవడం తప్పనిసరంటూ అమెరికా ప్రభుత్వం నిబంధనలు విధించబోదని అంటువ్యాధుల నిపుణుడు ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త ఆంథోనీ ఫౌచీ స్పష్టం చేశారు. ‘టీకా తీసుకోవాలంటూ ఎవరీ బలవంతం పెట్టం’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే వైద్య సిబ్బంది వంటి కొన్ని వర్గాలకు మాత్రం టీకాను తప్పనిసరి చేయాల్సి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీకాలపై ఉన్న నిర్హేతుకమైన భయాల కారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అనేక మంది ఇప్పటికీ వ్యాక్సిన్ల‌ను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కరోనా కట్టడిలో ప్రభుత్వం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అయితే అపోహలు దూరం చేసి వారి నమ్మకం పొందేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఆస్ట్రేలియా ప్రధాని కూడా టీకా తప్పనిసరి కాదని చెప్పిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-08-21T04:20:24+05:30 IST