మరో 3 నెలల్లో అందుబాటులోకి రానున్న కరోనా టీకా!

ABN , First Publish Date - 2020-10-03T20:56:33+05:30 IST

మరో మూడు నెలల్లో బ్రిటన్ ప్రజలందరికీ కరోనా టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రఖ్యాత టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. కొత్త ఏడాది ప్రారంభమయ్యేలోపే కావలిసిన అనుమతులను ప్రభుత్వం జారీ చేయాలని టీకా రూపకల్పనలో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలు ఆశిస్తున్నట్టు పేర్కొంది.

మరో 3 నెలల్లో అందుబాటులోకి రానున్న కరోనా టీకా!

లండన్: మరో మూడు నెలల్లో బ్రిటన్ ప్రజలందరికీ కరోనా టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రఖ్యాత టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. కొత్త ఏడాది ప్రారంభమయ్యేలోపే కావలిసిన అనుమతులను ప్రభుత్వం జారీ చేయాలని టీకా రూపకల్పనలో పాలుపంచుకుంటున్న శాస్త్రవేత్తలు ఆశిస్తున్నట్టు పేర్కొంది. అయితే..చిన్నారులు మినహా మిగతా ప్రజలందరికీ టీకా ఇవ్వదలిస్తే ఈ ప్రక్రియ మొత్తం మరింత వేగవంతమయ్యే అవకాశం ఉన్నట్టు అక్కడి నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.


ఇదిలా ఉండే.. మరో ఆరు నెలల్లో బ్రిటన్‌లో ప్రతి ఒక్కరికీ మరో ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందనేది ప్రభుత్వాధికారుల అంచనా అని కూడా టైమ్స్ పేర్కొంది. మరోవైపు..ఐరోపాకు చెందిన యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ .. ఆక్స్‌ఫర్డ్ టీకా పురోగతిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో పరిశీలిస్తున్నట్టు గురువారం నాడు ప్రకటించింది. వ్యాక్సిన్ విడుదలను వేగవంతం చేసేందుకే మెడికల్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 


ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలి రెగ్యులేటరీ సంస్థ ఈఎమ్ఏనే కావడంతో ఈ పరిణామానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ద్వారా కరోనాకు చెక్‌పెట్టేందుకు ప్రస్తుతం బ్రిటన్ దూకుడు ప్రదర్శిస్తోంది. యూరప్‌లో మొదటగా ఆక్స్‌ఫర్డ్ టీకా అందుబాటులోకి రావచ్చన్న వార్తలు ఇప్పటికే హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈఎమ్ఏ తీసుకున్న నిర్ణయం టీకాకు సంబంధించి కొత్త ఆశలను రేపుతోంది.  

Updated Date - 2020-10-03T20:56:33+05:30 IST