యూపీలో పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-22T00:45:12+05:30 IST

యూపీలో పెరిగిన కరోనా కేసులు

యూపీలో పెరిగిన కరోనా కేసులు

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ యూపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రోజు యూపీలో కొత్తగా 4,703 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3,58,893 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వల్ల ఇవాళ 88 మంది మృతి చెందగా, మొత్తం 5,135 మంది చనిపోయినట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 80.69 శాతంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 80.69 శాతంగా ఉందని,  ప్రస్తుతం 64,164 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-22T00:45:12+05:30 IST