తమిళనాడులో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ABN , First Publish Date - 2020-06-07T02:34:14+05:30 IST

తమిళనాడులో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

తమిళనాడులో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా తమిళనాడు రాష్ట్ర  ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ తమిళనాడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా 1,458 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. శనివారం రోజు కరోనా వల్ల 19 మంది మృతి చెందగా.. మొత్తం 251 మంది కోవిడ్-19తో మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30,152 కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2020-06-07T02:34:14+05:30 IST