ఆ రెండు సిటీల్లో లాక్ డౌన్ పొడిగింపు

ABN , First Publish Date - 2020-04-26T00:55:32+05:30 IST

ఆ రెండు సిటీల్లో లాక్ డౌన్ పొడిగింపు

ఆ రెండు సిటీల్లో లాక్ డౌన్ పొడిగింపు

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై, పుణెలో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ప్రకటించారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ ను పొడిగించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. మే 3 తర్వాత కూడా మరో 15 రోజులపాటు లాక్ డౌన్ ను పొడిగిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2020-04-26T00:55:32+05:30 IST