కోవిడ్-19 లాక్‌డౌన్.. గంగా నదిలో తగ్గిన కాలుష్యం
ABN , First Publish Date - 2020-04-05T23:28:53+05:30 IST
కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో.. గంగా నదిలో కాలుష్యం తగ్గిందని బెనారస్ హిందు

వారణాసి: కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో.. గంగా నదిలో కాలుష్యం తగ్గిందని బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ప్రొఫెసర్ పీకే మిశ్రా తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా పరిశ్రమలు మూతబడ్డాయి. అయితే పరిశ్రమలు విడుదల చేసే వ్యర్థాలతో గంగా నదిలో కొంతమేరకు కాలుష్యం ఏర్పడుతుంది. ఇప్పుడు పరిశ్రమలు మూతబడటంతో.. ఆ కాలుష్యం శాతం తగ్గింది.
దీని గురించి మిశ్రా మాట్లాడుతూ.. ‘‘గంగా నదిని కలుషితం కావడానికి 10శాతం కారణం పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థా వల్లే. ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలు మూతబడ్డాడు. దీంతో పరిస్థితి కాస్త మెరుగుపడింది. గంగా నదిలో ఎంతో మార్పు వచ్చింది. 15-16 తేదీల్లో వర్షం కురవడంతో.. నీటమట్టం కూడా పెరిగింది. దీంతో నది దాన్ని అదే శుభ్రం చేసుకొనే సామర్థ్యం మరింత పెరిగింది’’ అని పేర్కొన్నారు.
గంగా నదిలో ఎంతో మార్పు కనిపిస్తుందని స్థానికులు కూడా అంటున్నారు. ప్రస్తుతం నీళ్లు శుభ్రంగా కనిపిస్తున్నాయని.. పరిశ్రమలు మూతపడటమే ఇందుకు ప్రధాన కారణమని వాళ్లు చెబుతున్నారు. నదిలో ఎవరు స్నానం చేయడం లేదని.. ఇలాగే మరో పది రోజులు కొనసాగితే.. మళ్లీ పాత గంగా నదిని చూస్తామని అనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు.