కేరళకు చెందిన ఓ మహిళకు 19 సార్లు కోవిడ్-19 పాజిటివ్
ABN , First Publish Date - 2020-04-22T01:06:50+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేరళకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేరళకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన మహిళకు ఏకంగా 42 రోజులపాటు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. 62 ఏళ్ల మహిళకు 19 సార్లు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మార్చి నెలలో బాధితురాలి కుటుంబ సభ్యులు ఇటలీ నుంచి తిరిగి వచ్చారు. కేరళలోని పతనమిట్టకు చెందిన 62 ఏళ్ల మహిళకు 19 సార్లు కరోనా వైరస్ పరీక్షలు చేయగా వరుసగా 19 సార్లు పాజిటివ్ వచ్చింది. ఈ ఘటనపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత మహిళ మార్చి నెల 10వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది.