నాశిక్‌లో విజృంభిస్తున్న కరోనా..

ABN , First Publish Date - 2020-05-12T04:34:16+05:30 IST

మహారాష్ట్రలోని నాశిక్‌లో కరోనా మహమ్మారి క్రమంగా విజృంభిస్తోది. ఇవాళ ఒక్కరోజే నాశిక్‌లో 18 మంది..

నాశిక్‌లో విజృంభిస్తున్న కరోనా..

నాశిక్: మహారాష్ట్రలోని నాశిక్‌ జిల్లాలో కరోనా మహమ్మారి క్రమంగా విజృంభిస్తోది. ఇవాళ నాశిక్‌లో మరో 18 మంది కొవిడ్-19 వ్యాధికి గురైనట్టు గుర్తించారు. దీంతో నాశిక్‌లో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 689కి చేరినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇటీవల మరణించిన ఐదుగురు వ్యక్తులకు కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో మొత్తం మృతుల సంఖ్య 33కు చేరింది. జిల్లాలోని మాలేగావ్‌లోనే అత్యధికంగా 547 కేసులు నమోదు కాగా.. నాశిక్ సిటీలో 39, తాలూకాల నుంచి 82 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-05-12T04:34:16+05:30 IST