24 గంటల్లో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు

ABN , First Publish Date - 2020-05-19T01:37:22+05:30 IST

త 24 గంటల్లో రికార్డు రికార్డు స్థాయిలో 157 మరణాలు సంభవించగా, 5,234 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా..

24 గంటల్లో రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో రికార్డు రికార్డు స్థాయిలో 157 మరణాలు సంభవించగా, 5,234 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య తాజాగా 3,029కు, మొత్తం కేసుల సంఖ్య 96,169కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. వీటిలో 56,316 యాక్టివ్ కేసులు ఉండగా, 36,823 మందికి పూర్తి స్వస్థత చేకూరింది.


కొత్తగా నమోదైన 157 మంది కోవిడ్-19 మృతుల్లో మహారాష్ట్రలో 63 మరణాలు, గుజరాత్‌లో 34 మంది, ఢిల్లీలో 31 మంది, పశ్చిమబెంగాల్‌లో 6, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో చెరో ఐదు, తమిళనాడులో 4, పంజాబ్‌లో 3, ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, జమ్మూకశ్మీర్, కర్ణాటక, ఒడిశాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దేశవ్యాప్తంగా 3,029 మంది కోవిడ్ మృతుల్లో మహారాష్ట్రలో 1,198తో మొదటి స్థానంలో ఉండగా, 659 మంది మృతులతో గుజరాత్ రెండో స్థానంలో, 248 మందితో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నారు.

Updated Date - 2020-05-19T01:37:22+05:30 IST