ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు...

ABN , First Publish Date - 2020-03-28T15:35:22+05:30 IST

ఐర్లాండ్ దేశం నుంచి తిరిగివచ్చిన చెన్నై యువకుడు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని తమిళనాడు వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి విజయభాస్కర్ చెప్పారు....

ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు...

చెన్నై : ఐర్లాండ్ దేశం నుంచి తిరిగివచ్చిన చెన్నై యువకుడు కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడని తమిళనాడు వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి విజయభాస్కర్ చెప్పారు. ఐర్లాండ్ దేశంలో పర్యటించిన చెన్నై తిరిగివచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకడంతో అతన్ని ఆసుపత్రిలోని ఐసోలేషన్ గదికి తరలించారు. కరోనా నుంచి యువకుడు పూర్తిగా కోలుకోవడంతో అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి 14రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించామని మంత్రి చెప్పారు. ఈ యువకుడికి రెండుసార్లు పరీక్షలు జరపగా అతనికి కరోనా నెగిటివ్ అని వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-28T15:35:22+05:30 IST