ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో కరోనా టెస్టులు... 9మందికి పాజిటివ్ నిర్థారణ!

ABN , First Publish Date - 2020-09-20T17:08:06+05:30 IST

మహారాష్ట్రలోని నాగపూర్‌లో గల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కేంద్ర కార్యాలయంలో తొమ్మిదిమంది సీనియర్ కార్యకర్తలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు మీడియాకు తెలియజేస్తూ...

ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో కరోనా టెస్టులు... 9మందికి పాజిటివ్ నిర్థారణ!

నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్‌లో గల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కేంద్ర కార్యాలయంలో తొమ్మిదిమంది సీనియర్ కార్యకర్తలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒకరు మీడియాకు తెలియజేస్తూ, ఆర్ఎస్ఎస్ కేంద్రకార్యాలయంలోని తొమ్మిదిమందికి కరోనా సోకిందని, వారిని సెల్ఫ్ ఐసోలేషన్‌కు తరలించారని, వారంతా వయసుపైబడిన వారేనని తెలిపారు. వీరికి కరోనా సోకిన నేపధ్యంలో కేంద్రకార్యాలయంలో శానిటైజేషన్ చేశారన్నారు. కాగా కరోనా కట్టడి కోసం స్కూళ్లు మూతపడిన నేపధ్యంలో విద్యకు దూరమైన చిన్నారులకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విద్యాబోధన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆర్‌ఎస్ఎస్ కార్యకర్తలు గ్రామప్రాంతాల్లోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారికి తరగతులు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2020-09-20T17:08:06+05:30 IST