కోవ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షకు అనుమతి

ABN , First Publish Date - 2020-10-23T07:45:08+05:30 IST

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఉన్న ప్రధాన సంస్థల్లో ఒకటైన భారత్‌ బయోటెక్‌కు మూడో దశ ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి అనుమతులు లభించాయి...

కోవ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షకు అనుమతి

  • భారత్‌ బయోటెక్‌కు డీజీసీఐ గ్రీన్‌సిగ్నల్‌


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఉన్న ప్రధాన సంస్థల్లో ఒకటైన భారత్‌ బయోటెక్‌కు  మూడో దశ ప్రయోగ పరీక్షలు నిర్వహించడానికి అనుమతులు లభించాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)తో కలిసి సంయుక్తంగా భారత్‌ బయోటెక్‌ కోవ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తోంది. మూడో దశ పరీక్షలను  18  ఏళ్లు పైబడ్డ 28, 500 మందిపై నిర్వహిస్తారు. 10 రాష్ట్రాల్లోని 19 నగరాల్లో ఈ పరీక్షలు జరుపుతారు. మూడోదశ క్లినికల్‌ పరీక్షలకు భారత్‌ బయోటెక్‌ అక్టోబరు 2న డీజీసీఐకి దరఖాస్తు చేసింది. జంతువులపై జరిపిన పరీక్షల్లో వ్యాధి-నిరోధకత పెరిగినట్లు తేలిందని భారత్‌ బయోటెక్‌ గత నెలలో ఓ నివేదికలో పేర్కొంది.

Updated Date - 2020-10-23T07:45:08+05:30 IST