బస్సులో దంపతులకు కరోనా.. ప్రయణికుల పరుగు

ABN , First Publish Date - 2020-06-24T00:05:00+05:30 IST

తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు కుద్దలూరు జిల్లాలోని పాన్రుతి నుంచి వడలూరుకు ప్రయాణికులతో వెళ్తోంది. సమయం సరిగ్గా 12:15లకు బస్సులో ఉన్న ఇద్దరు దంపతులకు ఒక ఫోన్ వచ్చింది

బస్సులో దంపతులకు కరోనా.. ప్రయణికుల పరుగు

చెన్నై: ప్రయాణికులతో బస్సు గమ్య స్థానానాకి వెళ్తోంది. ఇంతలో ప్రయాణికుల్లోని దంపతులకు కోవిడ్-19 పాజిటివ్ అనే విషయం తెలిసింది. అంతే బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. తమిళనాడులోని కుద్దలూరు ప్రాంతంలో సోమవారం జరిగిందీ సంఘటన.


తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు కుద్దలూరు జిల్లాలోని పాన్రుతి నుంచి వడలూరుకు ప్రయాణికులతో వెళ్తోంది. సమయం సరిగ్గా మద్యాహ్నం 12:15లకు బస్సులో ఉన్న ఇద్దరు దంపతులకు ఒక ఫోన్ వచ్చింది. వారిద్దరికీ కోవిడ్-19 పాజిటివ్ అని ఆ ఫోన్ సారాంశం. అంతే బస్సులో ఉన్న డ్రైవర్, కండక్టర్ సహా 15 మంది ప్రయాణికులు పరుగులు తీశారు. డ్రైవర్, కండక్టర్ కద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అండర్‌గ్రౌండ్‌కు వెళ్లనున్నట్లు ప్రకటించారు.


వాస్తవానికి దంపతులు అంతకు ముందు రోజే కోవిడ్-19 టెస్ట్ కోసం నమూనాలు ఇచ్చారు. అయితే ఆ పరీక్షలో వారికి పాజిటివ్ అని తేలే సరికి.. వారిని ఆసుపత్రికి తీసుకుపోవడానికి వారి ఇంటికి ఆసుపత్రి సిబ్బంది వెళ్లారు. వారు అక్కడ లేకపోవడంతో వారికి ఫోన్ చేసి విషయం చెప్పారు. సరిగ్గా అదే సమయానికి వారు ఆర్టీసీ బస్సులో ప్రయాణంలో ఉన్నారు.

Read more