దాదాపు అరగంట ఊపిరందలేదు: కరోనా సోకిన స్టార్ ప్లేయర్

ABN , First Publish Date - 2020-04-01T23:12:14+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి.

దాదాపు అరగంట ఊపిరందలేదు: కరోనా సోకిన స్టార్ ప్లేయర్

లివర్‌పూల్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకితే ఎంత కష్టంగా ఉంటుందో ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ పేపే రైనా చెప్పారు. ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ ఫుట్‌బాల్ జట్టులో మాజీ గోల్ కీపర్‌గా ఉన్న రైనా.. ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ అనుభవం గురించి మాట్లాడుతూ..‘రెండు వారాల క్రితం నుంచి ఒంట్లో కొంచెం నలతగా ఉంటోంది. అనుమానం వచ్చి పరీక్షలే చేయించుకుంటే కరోనా సోకినట్లు తేలింది. అమ్మో! ఆ అనుభవం భరించలేకపోయా. దాదాపు 25 నిమిషాలపాటు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడ్డా. నా జీవితంలో అత్యంత కఠినమైన క్షణాలవి’ అని వెల్లడించాడు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే 8.7లక్షలపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. వీరిలో 43వేలకుపైగా మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-04-01T23:12:14+05:30 IST